తెలుగు సామెతలు
మరుగున పడుతున్న 200కు పైగా తెలుగు సామెతలు:
- అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
- అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
- అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
- అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
- అనువు గాని చోట అధికులమనరాదు
- అభ్యాసం కూసు విద్య
- అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
- అయితే ఆదివారం కాకుంటే సోమవారం
- ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
- ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
- ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
- ఇంట గెలిచి రచ్చ గెలువు
- ఇల్లు పీకి పందిరేసినట్టు
- ఎనుబోతు మీద వాన కురిసినట్టు
- చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
- కందకు లేని దురద కత్తిపీటకెందుకు
- కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
- కుక్క కాటుకు చెప్పుదెబ్బ
- కోటి విద్యలూ కూటి కొరకే
- నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
- పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
- పిట్ట కొంచెం కూత ఘనం
- రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
- వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
- కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
- మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
- ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
- ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
- ఆదిలోనే హంసపాదు
- ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
- ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
- ఆకాశానికి హద్దే లేదు
- ఆలస్యం అమృతం విషం
- ఆరే దీపానికి వెలుగు యెక్కువ
- ఆరోగ్యమే మహాభాగ్యము
- ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
- ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
- అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
- అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
- అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
- ఏ ఎండకు ఆ గొడుగు
- అగ్నికి వాయువు తోడైనట్లు
- ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
- అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
- అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
- అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
- అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
- అప్పు చేసి పప్పు కూడు
- అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
- అయ్యవారిని చెయ్యబోతే కోతి బొమ్మ అయినట్లు
- బతికుంటే బలుసాకు తినవచ్చు
- భక్తి లేని పూజ పత్రి చేటు
- బూడిదలో పోసిన పన్నీరు
- చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు - చాప కింద నీరులా
- చచ్చినవాని కండ్లు చారెడు
- చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
- విద్య లేని వాడు వింత పశువు
- చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
- చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
- చక్కనమ్మ చిక్కినా అందమే
- చెడపకురా చెడేవు
- చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు
- చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
- చింత చచ్చినా పులుపు చావ లేదు
- చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట - చిలికి చిలికి గాలివాన అయినట్లు
- డబ్బుకు లోకం దాసోహం
- దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
- దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
- దాసుని తప్పు దండంతో సరి
- దెయ్యాలు వేదాలు పలికినట్లు
- దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
- దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
- దొంగకు తేలు కుట్టినట్లు
- దూరపు కొండలు నునుపు
- దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
- దురాశ దుఃఖమునకు చేటు
- ఈతకు మించిన లోతే లేదు
- ఎవరికి వారే యమునా తీరే
- ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
- గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
- గాజుల బేరం భోజనానికి సరి
- గంతకు తగ్గ బొంత
- గతి లేనమ్మకు గంజే పానకం
- గోరు చుట్టు మీద రోకలి పోటు
- గొంతెమ్మ కోరికలు
- గుడ్డి కన్నా మెల్ల మేలు
- గుడ్డి యెద్దు చేలో పడినట్లు
- గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
- గుడినే మింగేవాడికి లింగమొక లెక్కా
- గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
- గుడ్ల మీద కోడిపెట్ట వలే
- గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
- గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
- గురువుకు పంగనామాలు పెట్టినట్లు
- తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
- ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
- ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
- ఇంటికన్న గుడి పదిలం
- ఇసుక తక్కెడ పేడ తక్కెడ
- జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
- కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
- కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
- కాకి ముక్కుకు దొండ పండు
- కాకి పిల్ల కాకికి ముద్దు
- కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
- కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
- కాసుంటే మార్గముంటుంది
- కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
- కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
- కలిమి లేములు కావడి కుండలు
- కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
- కంచే చేను మేసినట్లు
- కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
- కందకు కత్తి పీట లోకువ
- కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
- కీడెంచి మేలెంచమన్నారు
- కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
- కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
- కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
- కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
- కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
- కూటికి పేదైతే కులానికి పేదా
- కొరివితో తల గోక్కున్నట్లే
- కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
- కొత్తొక వింత పాతొక రోత
- కోటి విద్యలు కూటి కొరకే
- కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయటపడ్డదట
- కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
- కృషితో నాస్తి దుర్భిక్షం
- క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
- కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
- కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
- ఉన్న లోభి కంటే లేని దాత నయం
- లోగుట్టు పెరుమాళ్ళకెరుక
- మెరిసేదంతా బంగారం కాదు
- మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
- నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
- మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
- మనిషి మర్మము.. మాను చేవ…
బయటకు తెలియవు - మనిషి పేద అయితే మాటకు పేదా
- మనిషికి మాటే అలంకారం
- మనిషికొక మాట పశువుకొక దెబ్బ
- మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
- మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
- మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాలా
- మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
- మొక్కై వంగనిది మానై వంగునా
- మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు
- మోసేవానికి తెలుసు కావడి బరువు
- ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి
- ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
- ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
- ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
- నడమంత్రపు సిరి నరాల మీద పుండు
- నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
- నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
- నవ్వు నాలుగు విధాలా చేటు
- నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
- నిదానమే ప్రధానము
- నిజం నిప్పు లాంటిది
- నిమ్మకు నీరెత్తినట్లు
- నిండు కుండ తొణకదు
- నిప్పు ముట్టనిదే చేయి కాలదు
- నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
- నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి
- ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
- ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
- ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
- బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
- ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
- ఊరు మొహం గోడలు చెపుతాయి
- పనమ్మాయితో సరసం కంటే అత్తరు సాయిబుతో కలహం మేలు
- పాము కాళ్ళు పామునకెరుక
- పానకంలో పుడక
- పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
- పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు
- పండిత పుత్రః పరమశుంఠః
- పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
- పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
- పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
- పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
- పెళ్ళంటే నూరేళ్ళ పంట
- పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
- పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
- పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
- పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
- పిచ్చోడి చేతిలో రాయిలా
- పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
- పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
- పిండి కొద్దీ రొట్టె
- పిట్ట కొంచెము కూత ఘనము
- పోరు నష్టము పొందు లాభము
- పోరాని చోట్లకు పోతే, రారాని మాటలు రాకపోవు
- పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నాడట
- పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
- పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
- రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
- రామాయణంలో పిడకల వేట
- రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
- రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
- రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు
- రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
- రౌతు కొద్దీ గుర్రము
- ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
- చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
- సంతోషమే సగం బలం
- సిగ్గు విడిస్తే శ్రీరంగమే
- శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు
ఇవి కూడా చదవండి
- 10 Telugu Proverbs That Contain More Wisdom Than a Shelf of Self-Help Books
- సమాసాలు – Samasalu (Compound Words in Telugu Grammar)
- తెలుగు భాష చరిత్ర pdf
More: Telugu Language · Stories in 14 languages · Srikaram home
✍️ Have a story or article to share? Submit it for review and get published on Srikaram.org.
Related Posts
Telugu Short Stories నీ తోక నాకు నా తోక నీకు – (కమ్మని వూహలు)
Science for Kids The Water Cycle for Kids: Evaporation, Condensation, and Precipitation Made Easy
Child Psychology 50 Positive Affirmations for Kids to Build Confidence and Self-Esteem
Child Psychology Why Teaching Your Child Their Mother Tongue Boosts Their Overall IQ
Telugu Language తెలుగు సాహిత్యంలో కవిత్వం
Telugu Language Key Telugu dialects
Popular Posts
Telugu Language Differences between Andhra Telugu and Telangana Telugu
World History & Culture Differences between Mahabharata and Ramayana
Telugu Language సమాసాలు: నిర్వచనం, రకాలు మరియు ఉదాహరణలు
Telugu Language Samyuktha Aksharalu in Telugu
World History & Culture Impact of Mahabharata on Indian culture
Food, Culture and Heritage శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) Sri Sri (Srirangam Srinivasa Rao)
