కాకరకాయ కహానీ (సంయుక్త అక్షరాలు లేని సరదా కథ)

       ఒకప్పుడు పళ్ళు , కూరగాయలన్నీ ఒకే రంగులో, ఒకే ఆకారంలో , ఒకే రుచితో వుండేవట. మానవులు అవి తినీ తినీ అలసిపోయారు. ఏ చెట్టు చూసినా కాయలతో నిండుగా కళకళలాడుతా వుండేది… కానీ దేనినీ తినబుద్ధి అయ్యేది కాదు.…

మంత్రాల మర్రిచెట్టు (సరదా జానపద కథ)

ఒకూర్లో ఎల్లన్నని ఒకడుండేటోడు. వాడు ఏ పనీ చేసేటోడు గాదు. ఎప్పుడు చూడు అల్లరిచిల్లరగా తిరుగుతా, వాళ్ళలో వీళ్ళతో గొడవలు పడతా, దొంగతనాలు చేస్తా బతికేటోడు.వాళ్ళూరికి ఒక రోజు ఒక ముని వచ్చినాడు. ఆ మునికి చానా మహిమలున్నాయని ఊరంతా గొప్పగా…

అదృష్టం అంటే నీదేరా (అద్భుత సరదా కథ)

ఒక ఊరిలో ఒక రైతు వుండేటోడు. ఆయన చానా పేదోడే కానీ చానా చానా మంచోడు. మూగవాళ్ళకు నోటిలో మాటలాగుండేటోడు. గుడ్డివాళ్ళకు చక్కని చూపులాగుండేటోడు. ముసలివాళ్ళకు చేతికర్రలాగుండేటోడు. ఆడపిల్లలకు ధైర్యాన్నిచ్చే ఆయుధంలా వుండేటోడు. వూరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరింట్లో…

నాకు మూడు నీకు రెండు (పడీ పడీ నవ్వించే జానపద కథ)

ఒకూరిలో ఒకడుండేటోడు. వానికి వాని పెండ్లానికి అస్సలు పడేదిగాదు. ప్రతిదానికీ నువ్వెంతంటే… నువ్వెంతంటూ… పందెం కోళ్ళలెక్క గొడవ పడేటోళ్ళు. ఎవరూ కొంచం కూడా వెనక్కి తగ్గేటోళ్ళు కాదు.ఒకరోజు మొగుడు జొన్నపిండి తీస్కోనొచ్చి రొట్టెలు చేయమని పెండ్లానికిచ్చినాడు. సరే అని ఆమె పిండి…

తోక తెగిన పిల్లి (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ)

ఒక అడవిలో ఒక పెద్ద చెరువు వుండేది. ఆ చెరువులో చానా చేపలు తిరుగుతా వుండేవి. అవి చానా తెలివైనవి. వేటికీ అంత సులభంగా దొరికేవి కావు. అన్నీ కలసిమెలసి గొడవ పడకుండా ఆపదల నుంచి గట్టెక్కేవి.* ఆ అడవిలో ఒక…

పిచ్చిరాజు (జానపద హాస్య కథ)

ఒకప్పుడు మనదేశంలో 'గుండురాజ్యం' అని ఒక రాజ్యముండేది. దాన్ని పాలించే రాజు పెద్ద తిక్కలోడు. తాను ఏమి చెప్తే అందరూ అదే చేయాలని అనేటోడు. కాదన్నా, ఎదిరించినా వాళ్ళని పట్టుకోనొచ్చి కాళ్ళో, చేతులో తీయించేటోడు. దాంతో జనాలంతా భయపడి ఎన్ని బాధలనుభవిస్తా…

దొరికిన పోయిన దొంగ (చిన్న కథ)

ఒక ఊరిలో ఒక గజదొంగ వుండేటోడు. గజదొంగ అంటే పెద్ద పెద్ద మీసాలు, చారల చారల అంగీ అలా ఏమీ వుండవు. చూడ్డానికి అందరిలాగే చానా మామూలుగా, సాదాసీదాగా, అమాయకంగా వుండేటోడు. పొద్దున్నే బైలుదేరి అందరితో సరదాగా మాటలాడతా, ఎక్కడెక్కడ ఇళ్ళకు…

పిరికివానితో చేతులు కలపకు (జానపద హాస్య నీతి కథ)

ఒకూర్లో ఒక రైతుండేటోడు. ఆయనకో పెండ్లాముండేది. ఆమె చానా తెలివైనది. వాళ్ళకు ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఒకసారి పండుగకని వాళ్ళు వాళ్ళ అత్తోళ్ళ వూరికి బైలుదేరినారు. అప్పట్లో ఇప్పట్లా రైళ్ళూ, బస్సులూ, రోడ్లు లేవు గదా... యాడికైనా సరే నడుచుకుంటానే పోవాలి.…

అటక మీద ఏముంటాదిలే అత్తా (సంయుక్త అక్షరాలు లేని కథ)

ఒక వూరిలో ఒక కొత్త కోడలు వుండేది. ఆమెకు చిన్నప్పటి నుంచీ పుట్టింటిలో రకరకాల పిండివంటలు రోజూ చేసుకోని తినే అలవాటు వుండేది. కొత్తగా కాపురానికి వచ్చింది గదా... ఇక్కడ అలా తింటే ఎవరేమి అనుకుంటారో అని ఒకటే భయం. దాంతో…

చిలుక ముక్కు వూడిపాయ

పిల్లలకు జ్ఞాపకశక్తి పెంచడంకోసం మన పెద్దలు చెప్పిన అద్భుతమైన జానపద కథల్లో ఇది ఒకటి. ఇలాంటి కథలని *గొలుసుకట్టు కథలు* అంటారు. ఇక చదవండి- ఒకూర్లో ఒక చీమా, చిలుక కలసిమెలసి వుండేటివి. అవి రెండూ మంచి స్నేహితులు. ఒకరోజు ఆ…